Thamanna: మిల్క్ బ్యూటీ తమన్న గత రెండు సంవత్సరాల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఈమె ప్రేమలో ఉన్నట్టు అధికారకంగా ప్రకటించారు. ఇలా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడమే కాకుండా వీరిద్దరూ కలిసి జంటగా వెకేషన్ లకు వెళ్లడం ఫంక్షన్లకు వెళ్లడం జరిగింది.
ఇలా రెండు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎప్పుడు శుభవార్తను చెబుతారా అంటూ అభిమానులు ఎదురు చూశారు కానీ వీరు మాత్రం ఊహించని విధంగా బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. ఈ విధంగా తమన్నా విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకోవడంతో సోషల్ మీడియా వేదికగా తమన్న విజయ్ వర్మ ఫోటోలను డిలీట్ చేశారని తెలుస్తోంది. అయితే వీరి బ్రేకప్ గురించి ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.
ఇదిలా ఉండగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఉన్న ఫలంగా బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది అయితే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలే కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తమన్నా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కావాలన్నదే ఆమె కోరిక అందుకే పెళ్లి గురించి విజయవర్మ దగ్గర ప్రస్తావిస్తూ ఆయనని కాస్త ఒత్తిడికి గురి చేసిందని తెలుస్తోంది .
తమన్నా పెళ్లి చేసుకోవాలని పట్టు పట్టినప్పటికీ విజయ్ వర్మ మాత్రం పెళ్లి ఇప్పుడే వద్దని తాను కెరియర్ పై ఫోకస్ పెట్టాలి అంటూ పెళ్లి గురించి వాయిదా వేస్తూ వచ్చారట దీంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ కూడా బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. ఇలా బ్రేకప్ చెప్పుకున్న అనంతరం తమన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా విజయవర్మతో కలిసి ఉన్న ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేసినట్టు సమాచారం. మరి వీరి బ్రేకప్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలి.