Kinnera Mogulaih: కిన్నెర మొగిలయ్య పాపులారిటీకి కారణం పవన్ కళ్యాణ్ : థమన్

Kinnera Mogulaih: టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో పాటు హీరో రానా కూడా మరొక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యాయి.ఫిబ్రవరి 25న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లకు, పాటలకు, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇక ఈ సినిమా పై పవన్ కళ్యాణ్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇకపోతే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ప్రతి ఒక్కరిని కూడా అలరించింది. ఈ టైటిల్ సాంగ్ ను రూపొందించడానికి చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. తెలంగాణ యాస,భాష,సాహిత్యం కనిపించే టైటిల్ సాంగ్ ను కిన్నెర కళాకారుడు అయిన దర్శనం మొగిలయ్య తో పాడించాడు థమన్. ఈ పాటను సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పాట విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ప్రమోషన్ లో భాగంగా ఈ సాంగ్ ను మ్యూజిక్ వీడియోను రూపొందించగా ఆ వీడియోలో థమన్ టీమ్ తో పాటుగా దర్శనం మొగిలయ్య కూడా కనిపించి ఒక్కసారిగా మొగిలయ్య పాపులర్ అయ్యాడు.

అంతేకాకుండా ఇటీవలే పద్మశ్రీ పురస్కారానికి కూడా ఎంపికై అవార్డు ను కూడా అందుకున్న విషయం తెలిసిందే. అయితే మొగిలయ్యకు ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని థమన్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపాడు. సాంగ్ రూపొందిస్తున్న క్రమంలో దర్శనం మొగిలయ్య తో పాట పాడిస్తే బాగుటుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు థమన్ తెలిపాడు. మొగిలయ్య అడ్రస్ తో సహా చెప్పినట్టు చెప్పారు థమన్. అయితే, ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ తెలంగాణ జానపద, సాహిత్యాన్ని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కాపాడుతున్నారు అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.