Beast Telugu : ఇండస్ట్రీ టాక్ : తెలుగులో “బీస్ట్” గట్టి బిజినెస్ నే జరిపిందట..ఎన్ని కోట్లంటే.!

Beast Telugu : మన తెలుగు సినిమా మార్కెట్ దగ్గర కొద్దీ కొద్దిగా తన సినిమాల మార్కెట్ ని పెంచుకుంటున్న హీరోల్లో కోలీవుడ్ స్టార్ హీరో థలపతి విజయ్ కూడా ఒకడు. అయితే విజయ్ సినిమాలు తమిళ నాట రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరినీ షాక్ కి గురి చేస్తాయి. ఇక యూట్యూబ్ రికార్డులు విషయానికి వస్తే లెక్కే లేదు.
ఇండియాలోనే ఏ హీరో పాటలు కానీ ట్రైలర్స్ టీజర్స్ కి కూడా రాని రెస్పాన్స్ తెచ్చుకుంటాయి. మరి ఇప్పుడు తాను నటించిన లేటెస్ట్ సినిమా “బీస్ట్” పై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొనగా దీనికి సంబంధించి తెలుగులో బిజినెస్ లెక్కల వివరాలు తెలుస్తుంది.
తాను నటించిన లేటెస్ట్ సినిమా “మాస్టర్” కి డబుల్ మార్జిన్ లో ఈ సినిమా తెలుగు హక్కులు అమ్ముడుపోయాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. బీస్ట్ సినిమాకి గాను 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ ని ఒక్క తెలుగులోనే జరిపిందట. ఇది పెద్ద మొత్తంలో అని చెప్పాలి.
అంతే కాకుండా విజయ్ మార్కెట్ గ్రాఫ్ కూడా ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా వరుణ్ “డాక్టర్” ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే అనిరుద్ సంగీతం అందించాడు.