Movie corner: రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమా… ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో దక్షిణాది అన్ని భాషల్లో రిలీజ్ అయింది. అయితే హిందీ వర్షన్ ఇంకా రిలీజ్ లేదు. అక్కడ ఇంకా థియేటర్లలో మంచి వసూళ్లని సాధిస్తోంది. ప్రస్తుతం రోజుకి 2-2.5 కోట్ల వసూళ్లు వస్తున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో సూపర్ వసూళ్లు సాధిస్తుంది. కాగా ఫుల్ రన్‌లో రూ.90 కోట్ల మార్క్ దాటే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇక క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఐటెం సాంగ్ ప్రస్తుతం వివాదాస్పదం కావడం విశేషం. ఈ గీతంలోని సాహిత్యం తమను అవమాన పరిచే విధంగా ఉన్నాయని, తమ మనోభావాలు దెబ్బతీశారంటూ ఏపీఆర్ఎంపీ సంక్షేమ సంఘం నాయకులు ఆచార్య టీమ్ పై ఫైరవుతూ ధర్నా కూడా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితను కలిసిన ఆర్ఎంపీ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఎం. ఎస్. రాజు దర్శకత్వంలో రూపొందిన ‘7 డేస్ 6 నైట్స్’ మూవీ సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక తమిళ హీరో విశాల్ కొత్త డబ్బింగ్ సినిమా ‘సామాన్యుడు’. ఈ సినిమాకి నాట్ ఫర్ ఆ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షిక. మొదట సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది.