వైరల్ : “కొమురం భీముడో” సాంగ్ చూసిన తెలుగు సినిమా లెజెండరీ దర్శకుడు.!

Komuram Bheemudo Song

Komuram Bheemudo Song : తెలుగు సినిమాని తెలుగు సినిమాలా తెలుగుదనం కనిపించేలా ఎంతో అద్భుతంగా తీసే దర్శకులు ఇప్పుడు కరువయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగని ఇప్పుడు కూడా మంచి సినిమాలు రావట్లేదా అంటే వస్తున్నాయి. కానీ మన తెలుగుదనం తగ్గుతుంది.

అయితే తన సినిమాల్లో ఎంతో చక్కగా మంచి కథ కథనాలతో దిగ్గజంగా నిలిచిన సీనియర్ దర్శకుడు కళాతపస్వి కే విశ్వనాధ్ కోసం పరిచయం చేయనక్కర్లేదు. తాను చేసిన ప్రతి సినిమా కూడా తెలుగు సినిమా నుంచి ఒక ఆణిముత్యం. మరి అలాంటి లెజెండరీ దర్శకులు ఇప్పుడు వయసు మల్లి విశ్రాంతిలో ఉన్నారు.

అయితే తాజాగా ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ అలాగే మన తెలుగు నేలకి చెందిన నిజ జీవిత హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లపై దర్శకుడు రాజమౌళి తీసిన సినిమా ట్రిపుల్ ఆర్(RRR) సినిమా కోసం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన కొమురం భీముడో సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ గాని అందులో హీరో ఎన్టీఆర్ నటన గాని ఏ లెవెల్లో ఉన్నాయో చూసాం.

అయితే ఎన్టీఆర్ ఆ నటనను ఈ లెజెండరీ దర్శకుడు తన ఇంట్లో స్పెషల్ గా చూడడం జరిగింది. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో అనూహ్యంగా వైరల్ గా మారింది. ఇది అయితే నిజంగా ఎన్టీఆర్ అభిమానులకు ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పాలి.