Telugu Celebrities Died In 2021: సాధారణంగా ప్రతి మనిషి పుట్టిన తర్వాత మరణం అనేది తప్పకుండా సంభవిస్తుంది. ఈ రెండు విషయాలు ఎప్పుడు మన చేతుల్లో ఉండవు. ఒక వ్యక్తి ఎంతోమందికి పరిచయం అయ్యి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అకాల మరణం పొందిన వారి మరణం ఎంతో మందిని కలిచి వేసింది. ఇలా మన కుటుంబ సభ్యులు అయిన మనకు పరిచయమున్న ఉన్న వ్యక్తి మరణించిన ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన ఎంతో మంది విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటారు. అయితే ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు కన్నుమూసారు. మరి ఈ ఏడాది మృతి చెందిన సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే…
నాగయ్య: గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నాగయ్య వేదం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన ఇతను అనారోగ్యంతో బాధపడుతూ మార్చి 27 2021 మృతిచెందారు.
టిఎన్ ఆర్: ‘ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR అని టాక్ షో తో మంచి గుర్తింపు సంపాదించుకున్న టిఎన్ ఆర్ ని ఇంటర్వ్యూ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన కరోనా బారినపడి మృతి చెందారు.
కత్తి మహేష్: నటుడిగా ఫిలిం క్రిటిక్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
బిఎ రాజు: ఫిలిం జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించిన బీఏ రాజు ‘చంటిగాడు’ అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనారోగ్య సమస్యలు మృతి చెందారు.
శివ శంకర్ మాస్టర్: ఈయన కొరియోగ్రాఫర్ గా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి కరోనా వ్యాధి బారినపడి మృతి చెందారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి: ప్రముఖ సినీ గేయ రచయిత గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్ తో ఇటీవల మృతి చెందారు.