ఎన్టీఆర్ వచ్చాడు హైప్ తెచ్చాడు

Tellavarithe Guruvaram gets good hype with NTR

Tellavarithe Guruvaram gets good hype with NTR

ఈ కాలంలో చిన్న సినిమాలకు ప్రమోషన్లు చాలా అవసరం. పెద్ద సినిమాలే ప్రచారం కోసం కోట్లకు కోట్లు వెచ్చిస్తున్నాయి. అలాంటిది చిన్న సినిమాలు ప్రచారంలో ఇంకా ముందుండాలి. లేకపోతే జనాలకు గుర్తు కూడ ఉండవు సినిమాలు. ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడ తెలీదు. అందుకే చిన్న సినిమాల మేకర్స్ ప్రమోషన్ల విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. మొన్నామధ్యన విడుదలైన ‘జాతిరత్నాలు’ ప్రభాస్ ద్వారా ట్రైలర్ లాంచ్ చేయించి విపరీతమైన క్రేజ్ పొందింది. ‘ఉప్పెన’ కోసం మెగా ఫ్యామిలీ చేయాల్సిందంతా చేసింది. ఆ సినిమాలు రెండూ సూపర్ హిట్టయ్యాయి.

వచ్చే వారం ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా రానుంది. దర్శకుడు కొత్తవాడు. హీరో శ్రీసింహ. రాజమౌళి ఫ్యామిలీ నుండి వచ్చాడు. అతనికిది రెండవ సినిమా. అయినా ప్రమోషన్లు కావాలి కదా. అందుకే ప్రీరిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ వచ్చాడు. ఆయన రాకతో సినిమా మీద ప్రేక్షకుల్లో అటెంక్షన్ పెరిగింది. వచ్చే వారం విడుదలయ్యే చిత్రాల్లో ఇది కూడ ఒకటని జనాలకు తెలిసింది. ఎన్టీఆర్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. మొత్తానికి తారక్ రాకతో సినిమాకు కొత్త హైప్ వచ్చింది.