Revanth Reddy: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్-2025 సదస్సులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి గురించి తెలిపారు.గుజరాత్ మోడల్ ను టెస్ట్ ఫార్మాట్ తో పోల్చారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలు తెలంగాణ అభివృద్ధి నమూనా కలిగి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి మేము మా పొరుగు రాష్ట్రాలతో ఎప్పటికీ పోల్చుకోలేమనీ తెలిపారు.
మాకు ఎప్పటికీ కూడా న్యూయార్క్, సియోల్, టోక్యో, ఇతర దేశాలతో పోటీ పడుతున్నామన్నారు. అహ్మదాబాద్ కు తెలంగాణలో దేంట్లోనూ పోలిక లేదని చాలెంజ్ చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఒకసారి హైదరాబాద్ కి వచ్చి చూడండి హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక కేసీఆర్ ఒక చంద్రబాబు నాయుడు ఒక రాజశేఖర్ రెడ్డి వల్ల మాత్రమే జరగలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. కులీ కుతుబ్‌షాల కాలం నుంచే హైదరాబాద్ అభివృద్ధి అనేది ప్రారంభమైందని తెలిపారు. హైదరాబాద్ వంటి ఒక గొప్ప నగరాన్ని అభివృద్ధి చేయడం ఒకరి వల్ల సాధ్యమయ్యే పని కాదు అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. 450 ఏళ్ల చరిత్ర హైదరాబాద్ కు ఉంది. చార్మినార్, గోల్కొండ కోట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లను చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ నిర్మించారా అని ప్రశ్నించారు.
గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేయలేని అభివృద్ధిని ఏడాదిన్నర కాలంలో తాము చేసి చూపించామని రేవంత్ రెడ్డి తెలిపారు.నెలల్లో రూ.21 వేల కోట్లు రైతులకు మా ప్రభుత్వం రుణమాఫీ చేసాము అంటూ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.