తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ రోజు 3,334 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ బుధవారం మరీ కొన్ని ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపింది. 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.