TG: యూటర్న్ తీసుకున్న జంపింగ్ ఎమ్మెల్యేలు… రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారుగా?

TG: రాజకీయాలలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరికీ తెలియదు. అయితే రాజకీయ నాయకులు అన్న తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వలసలు వెళ్ళటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇలా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊహించని షాక్ తగిలింది. ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన వారు కాంగ్రెస్ లోకి వెళ్లడంతో ఈ విషయంపై బి.ఆర్.ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారిపై అనర్హత వేటు వేయాలి అంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. ఇలాంటి తరుణంలోనే బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అయోమయ పరిస్థితులలో ఉన్నారు.

ఇలా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఈ పదిమంది ఎమ్మెల్యేలు ఇటీవల దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇలా తమపై అనర్హత వేటు వేస్తే కనుక కచ్చితంగా ఆ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎన్నికలను ఎదుర్కోవడం ఎంతో కష్టతరమని ఎమ్మెల్యేలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినప్పటికీ వారికి కాంగ్రెస్ లో ఏ విధమైనటువంటి గౌరవం లభించలేదు అదేవిధంగా బిఆర్ఎస్ శ్రేణులు శత్రువుల్లా చూడటం వల్ల తాము రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భావించారు దీంతో తిరిగి సొంతగూటికి చేరాలనే ఆలోచనలో కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇలా తమపై కోర్ట్ అనర్హత వేటు వేయకముందే సొంత పార్టీకి వెళ్లాలని భావిస్తున్నారు ఇదే కనుక నిజం అయితే రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగులుతుందని చెప్పాలి.