అతడో 17 ఏళ్ళ కుర్రాడు.. ప్రేమ వివాహం చేసుకున్న అక్క తల నరికి సెల్ఫీ!

మహారాష్ట్రలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అని తల్లి, కొడుకు కలిసి కూతుర్ని అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపేసి అనంతరం అందరూ చూస్తుండగానే సోదరుడు గాల్లోకి తలను ఎగిరి వేశాడు. అనంతరం మొండెం నుంచి వేరు చేసిన తలతో తల్లీ కొడుకులు సెల్ఫీలు కూడా దిగారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేసింది.

తల్లి కొడుకు కలిసి ఆమెను భర్త ఇంటిలోనే హత్యచేసి పోలీసులకు లొంగిపోయారు. అక్కతో పాటు ఆమె భర్తపై కూడా దాడికి యత్నించగా ఆయన తప్పించుకున్నాడు. హతురాలు కీర్తి థోరే (19) ప్రేమించిన యువకుడితో ఈ ఏడాది జూన్‌ 21న ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. దీంతో ఆమె కుటుంబం తీవ్ర వేదనకు గరుయ్యింది. ఈ క్రమంలో గతవారం కీర్తిని కలిసిన ఆమె తల్లి ఇంటికి రావాలని కోరింది. ఆదివారం తన కుమారుడితో కలిసి కూతురు ఇంటికి వచ్చింది. తల్లీ సోదరుడు రావడంతో సంతోషించిన కీర్తి వారికి టీ తీసుకురావడానికి వంటింట్లోకి వచ్చింది.

అనారోగ్యంతో కీర్తి భర్తకు వేరే గదిలో ఉండగా, అదే అదునుగా భావించిన తల్లీకొడుకులు వంటింట్లోకి వెళ్లి కీర్తిపై దాడిచేశారు. కొడవలితో వచ్చిన సోదరుడు ఆమె తలను నరికేయగా తల్లి కీర్తి కాలు పట్టుకుంది. అనంతరం తలను బయటకు తెచ్చి ఇరుగుపొరుగువారు చూస్తుండగానే గాల్లోకి ఎగురవేశారు. అనంతరం పోలీస్ వీర్‌గావ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.