టీడీపీ రంగుల రాజకీయం.. బయటపెట్టిన వైఎస్ జగన్ పధకం.. ?

 

టీడీపీ కడుపు మంట మరోసారి తనకు తానుగా బయట పెట్టుకుందంటున్నారు ఏపీ ప్రజలు.. ఇదివరకే అవినీతి బురదలో పీకల లోతుల్లో కూరుకుపోయిన పచ్చరంగు పార్టీ, వైసీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏపీ సీయం జగన్‌ను ఎలాగైనా బద్నాం చేయాలనే సంకల్పంతో ఉన్న ఈ పార్టీ నాయకులు గోతికాడి నక్కలా కాచుక్కూర్చున్నారట.. ఇదిగో వీరి నోటికి దొరికిన పనికి పదును పెట్టి అనవసర రాద్దాంతం చేస్తున్నారంటున్నారు వైసీపీ కార్యకర్తలు.. ఆ విషయం ఏంటో తెలుసుకుంటే.. తాజాగా ఏపీ సీయం వైఎస్ ప్రారంభించిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కన్నుల పండుగగా జరిగిందన్న విషయం తెలిసిందే.. ఈ కార్యక్రమం ఏ స్థాయిలో విజయవంతం అయిందో అక్కడున్న చిన్నారుల మాటలు చాలు తెలియడానికి..

ఇవన్నీ చూసి తట్టుకోలేని టీడీపీ మరోసారి తన కుటిల బుద్దిని ప్రదర్శించింది.. విద్యాకానుకపై తమ అక్కసుని మాటల రూపంలో బయట పెట్టింది.. ఈసారి రంగుల పై రాజకీయం చేస్తూ జగనన్న విద్యా కానుకలో ఇచ్చిన వస్తువులపై వైసీపీ రంగులున్నాయని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెగ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సందుగా మరో నేత నక్కా ఆనంద్ బాబు ఇలాంటి పుస్తకాలు గతంలో మేమూ ఇచ్చాం, మీరు కొత్తగా ఇచ్చిందేంటి అంటూ రాగాలు తీశారు.. ఇక్కడ వీరు మరచిన విషయం ఏంటంటే పులి మీద చారలుంటాయి, పిల్లి మీద కూడా చారలుంటాయి అలాగని పిల్లి, పులి అయిపోతుందా ఏందంటూ కొందరు వైసీపీ నేతలు సైటర్లు వేసుకుంటున్నారట.. ఇది గమనించక రంగుల రాజకీయాలు మొదలు పెట్టింది టీడీపీ..

ఇకపోతే ప్రతిపక్షాలు ఇలాంటి పథకాలు అమలు చేసినప్పుడు వస్తువుల నాణ్యతలో ఏవైనా లోపాలుంటే ఎత్తి చూపాలి. కానీ వైఎస్ జగన్ ఏరికోరి మరీ హై-క్వాలిటీ ఉత్పత్తులను విద్యార్థులకు అందించారు.. ఇక నాణ్యత విషయన్ని గమనించని ఒంటెద్దు టీడీపీ వర్గీయులు మిడిసిపడుతున్నారట.. కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద ఇచ్చిన వస్తువులపై పసుపురంగే ఉండేది, చివరికి రేషన్ సరకులిచ్చే సంచిపై కూడా పచ్చరంగు గుమ్మరించిన సంస్కృతి బాబుది. అలాంటి బాబు అండ్ టీమ్ రంగుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. పసుపు స్థానంలో ఆకుపచ్చ వచ్చి చేరే సరికి పచ్చ కళ్లు చూడలేకపోతున్నాయట, అందుకే టీడీపీ నేతలు వస్తవుల నాణ్యతపై మాట్లాడే దమ్ములేకే, రంగులపై పడి ఏడుస్తున్నారంటున్నారట ఈ విషయం తెలిసిన నెటిజన్స్.. మొత్తానికి సక్సెస్ అయిన వైఎస్ జగన్ పధకం టీడీపీలో కడుపుమంట రగిలించిందన్న మాట..