విజయ్, సూర్యల బాటలోనే ధనుష్… మనోళ్ళకి గట్టి పోటీ

Tamil stars trying to settle in Tollywood
Tamil stars trying to settle in Tollywood
తమిళ హీరోలు చాలామందికి తెలుగు మార్కెట్ మీద ఎప్పటి నుండో కన్ను ఉంది.  ఇక్కడ ప్రేక్షకుల్ని మెప్పించి సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని చాలామంది ట్రై చేస్తున్నారు.  కొంతమంది ఆ ప్రయత్నాల్లో సఫలం అవుతున్నారు కూడ.  అయితే ఇన్నాళ్లు డబ్బింగ్ సినిమాలతోనే ఈ ప్రయత్నాలు చేసిన హీరోలు ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో వస్తున్నారు.  ఇప్పటికే స్టార్ హీరో విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టారు.  ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఉండనుంది.  ఇక ఈమధ్యన సూర్య కూడ నేరుగా ఒక తెలుగు సినిమా చేసే పనిల్ ఉన్నారని తెలిసింది. 
 
బోయపాటి శ్రీను సూర్య సినిమాను డైరెక్ట్ చేయవచ్చని, దిల్ రాజు ఈ కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్. ఇదిలా ఉండగా ఇపుడు ధనుష్ కూడ తెలుగులో సినిమా చేయటానికి ఉవ్విళ్లూరుతున్నారని తెలుస్తోంది.  ధనుష్ కు తెలుగునాట మంచి పేరుంది.  నటుడిగా సాలిడ్ గుర్తింపు ఉంది.  అందుకే ఒకసారి నేరుగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనేది ఆయన ఆలోచనట.  అందుకే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక మల్టీ లాంగ్వేజ్ మూవీకి ప్లాన్ చేస్తున్నారట.  త్వరలోనే ఈ సినిమా మీద ఒక క్లారిటీ రానుంది.  సో.. తమిళ హీరోలు చాలామంది తెలుగును గట్టిగానే టార్గెట్ చేశారు.  వీళ్లంతా ఇక్కడ పాగా వేస్తే మన హీరోలకి పోటీ తప్పదు మరి.