తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ వస్తున్న తమిళ హీరోలు

Tamil stars reaching hyderabad to do shootings
Tamil stars reaching hyderabad to do shootings
కరోనా ప్రభావంతో అన్ని సినీ పరిశ్రమలు మూతపడ్డాయి.  తమిళ ఇండస్ట్రీ అయితే మొదటి దఫా లాక్ డౌన్ నుండి కొలుకోకముందే రెండవ లాక్ డౌన్ దెబ్బకు కుదేలైంది.  అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ కఠినంగా అమలుచేస్తూ ఉండటంతో సినిమా షూటింగ్స్ మొదలయ్యే పరిస్థితి కనబడట్లేదు.దీంతో తమిళ హీరోల చూపు హైదరాబాద్ మీద పడింది. తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది.  ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తోంది. చిత్రీకరణలకు అనుమతులు కూడ ఇచ్చారు. దీంతో తెలుగు సినిమాలు చాలా పట్టాలెక్కడానికి సిద్దమయ్యాయి.  
 
ఇది చూసిన తమిళ హీరోలు తమ బేస్ హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో ఎలాగూ ఫిల్మ్ సిటీ ఉంది కాబట్టి అక్కడే సినిమాలను కంప్లీట్ చేసుకోవాలని, థియేటర్లు ఓపెన్ అయ్యే సమయానికి సిద్ధంగా ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే హీరో విశాల్ హైదరాబాద్ చేరుకుని షూటింగ్ కూడ మొదలుపెట్టడం జరిగింది. సూర్య తన కొత్త సినిమా షూటింగ్ ఇక్కడే చేస్తారట.ఆయన సోదరుడు కార్తి కూడ హైదరాబాద్లోనే మకాం వేయనున్నారు.  ఇక కమల్ హాసన్ సైతం కొత్త చిత్రాన్ని హైదరాబాద్లోనే షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట.  వీరే కాదు ఇంకా పలువురు తమిళ, హిందీ హీరోలు కూడ హైదరాబాద్లోనే సినిమాలు మొదలుపెట్టనున్నారు.