Pawan Kalyan: హీరో పవన్ కళ్యాణ్ ని కలవమని చెప్పిన తమిళ స్టార్ హీరో.. ఎవరు.. ఎందుకు?

Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఎలా అభిమానులున్నారో తమిళంలో హీరో అజిత్ కి కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. అదేవిధంగా వీరిద్దరిదికూడా విభిన్నమైన శైలి అయినప్పటికీ వీరిద్దరిలో ఏదో ప్రత్యేకత దాగి ఉండటం వల్ల వీరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో అరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకు ఎంతో మంచి క్రేజ్ ఉండేదని ఈ క్రమంలోనే తమ్ముడు సినిమా కథను తెరకెక్కించాలని హీరో అజిత్ దగ్గరికి వెళ్లాను. కథ మొత్తం విన్న అజిత్ మీరు వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలవమని చెప్పినట్లు అజిత్ తెలిపారు. అయితే అజిత్ ఇలా ఎందుకు చెప్పారని, అప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను చూసి తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ సినిమాలు చూసిన తర్వాత తమ్ముడు సినిమా తీయడానికి అజిత్ కన్నా పవన్ కళ్యాణ్ సరిగ్గా సరిపోతాడని భావించి అతనితో కలిసి ఈ సినిమాని తెరకెక్కించామని, ఈ సందర్భంగా అరుణ్ ప్రసాద్ తెలిపారు.ఇలా పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుందని ఈ సందర్భంగా అప్పట్లో జరిగిన ఈ విషయాన్ని అరుణ్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ బయటపెట్టారు.