Tamannaah Bhatia: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో ముంబై బ్యూటీ.. ఎవరో తెలుసా?

Tamannaah Bhatia: తమన్నా భాటియా ఈ పేరు వినగానే ముందుగా టక్కున గుర్తుకు వచ్చేది తన మిల్కీ అందం. ఈమె తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది ఈ బ్యూటీ. ఇకపోతే ఈ మధ్య కాలంలో తమన్నా సినిమాలు,వెబ్ సిరీస్ అని తేడా లేకుండా వరుసగా నటిస్తూ దూసుకుపోతోంది. అలాగే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎఫ్ 3, భోలా శంకర్ ఇలాంటి సినిమాల్లో నటిస్తోంది.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ చేస్తూ రెండు వైపులా డబ్బులను సంపాదిస్తోంది. అదే రేంజ్ లో సినిమాలకు పారితోషికం కూడా అందుకుంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఒక సినిమాకు తమన్నా రెండున్నర కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటోంది. ఇకపోతే తమన్నా హైదరాబాదులో ఎక్కువగా ఉంటున్నప్పటికీ ఆమె మాత్రం ముంబై లోనే సెటిల్ అయింది. ముంబైలో తమన్నా ఉంటున్న ఇల్లు ఖరీదు దాదాపుగా 80 లక్షలకు పై మాటే. ఇది ఇలా ఉంటే తమన్నాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే తమన్నా మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఒక కీలక పాత్రను చేస్తున్నట్లు, అందుకు తమన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

ఇకపోతే మొదట తమన్నా మోడలింగ్ ద్వారా తన కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్ కీ ఎదిగిన. అంతేకాకుండా ప్రస్తుతం బ్యూటీ వయసు 32 ఏళ్లు అయినా కూడా తరగని అందంతో గ్లామరస్ పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. సినిమాలలో తన అందం అభినయంతో యూత్ ని కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది.