Rajamouli : టాక్ : రాజమౌళి కావాలనే “RRR” విషయంలో ఇలా చేస్తున్నాడట.!

Rajamouli :  ప్రస్తుతం పాన్ ఇండియన్ మార్కెట్ దగ్గర అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటించిన చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది.

మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా చిత్ర బృందం కూడా ఆల్రెడీ రెండు తేదీలను అనౌన్స్ చేసి జాన్ఫార్మ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ రెండు డేట్స్ కి కూడా సినిమా రిలీజ్ చెయ్యట్లేదు అన్నట్టు ఇండస్ట్రీ లో ఫ్రెష్ గా వినిపిస్తున్న బిగ్ అప్డేట్.

మరి కొత్త డేట్ ఎప్పుడంటే ఇది మాత్రం సాలిడ్ ట్రీట్ అనే చెప్పాలి. మేకర్స్ మార్చ్ లో మిస్ చేసిన 18 డేట్ మినహాయించి ఆ వచ్చే వారం అంటే మార్చ్ 25 న రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ చేసి ఈ బిగ్ అప్డేట్ ని రివీల్ చేశారు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. రాజమౌళి మొదట చెప్పిన రెండు డేట్స్ కాకుండా కొత్త డేట్ కి కావాలనే వస్తున్నాడట.

గతంలో సంక్రాంతి బరికి కూడా ఇలాగే పలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్న సినిమాలు తెలిసి కూడా ట్రిపుల్ ఆర్ కి డేట్ అనౌన్స్ చేశారు. మరి ఈసారి కూడా ఏప్రిల్ 1 న ఆచార్య, లాంటి భారీ సినిమా ఫిక్స్ అయినా వీరూ కావాలని ఆ టైం కే పెట్టుకున్నారని ఇదంతా ఉద్దేశ పూర్వకంగా జరిగినట్టు ఉందని సినీ వర్గాల్లో టాక్. ఇక మరికొందరు అయితే రాజమౌళి ఇలా కెలకడం అవసరమా అని కూడా పెదవి విరుస్తున్నారు.