Talibans: ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించిన తాలిబన్లు..?

Talibans: ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తల్లో ఎక్కడ చూసినా కూడా ఉక్రెయిన్ సంక్షోభం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ దేశంపై రష్యా దేశం యుద్ధాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.రష్యా బలగాలు సరిహద్దులు దాటుకొని ఉక్రెయిన్ లోకి ప్రవేశించి దాడులు చేస్తున్నారు. ఇక ఈ యుద్ధాన్ని ఆపాలి అంటూ రష్యా కు పలు దేశాలు వినివిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాలి అని కోరిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తాజాగా తాలిబన్లు సైతం స్పందించారు.

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాలు సంయమనాన్నీ పాటించాలి అని తాలిబన్ ప్రభుత్వం ఒక ప్రకటనలో కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వారికి సూచించింది. ఉక్రెయిన్ తమ విద్యార్థులు చదువుకుంటున్నారు అని ఆ విద్యార్థుల రక్షణపై తాలిబన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజల గురించి ఆవేదన వ్యక్తం చేశారు.