డీకే అరుణ దెబ్బకి ఇప్పటికి విలవిలలాడుతున్న టి-కాంగ్రెస్

Dk Aruna Telugu Rajyam

 ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలంటే ఆ పార్టీలో అర్థబలం,అంగబలం కలిగిన బలమైన నేతలు ఉండాలి. అలాంటి నేతలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకి తీసుకొనివెళ్తేనే ఆ రాజకీయ పార్టీ ఉన్నత శిఖరాలను చేరగలదు. అలా కాకుండా కొన్ని కొన్ని విభేదాల వలన ఒకరిద్దరు నేతలు పొతే పోయారులే అనే ధోరణి కలిగి ఉంటే అది ఖచ్చితంగా పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి ఎదురైంది.

Dk Aruna Telugu Rajyam

 

  తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్కప్పుడు బలమైన రాజకీయ నాయకురాలిగా ఉమ్మడి మహబూబ్ జిల్లాలో ఆధిపత్యం చెలాయించిన డీకే అరుణ మారిన సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి గులాబీ గూటికి చేరింది. ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరం కావటంతో ఏకంగా ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నర్ధకం అయ్యింది. ఒకప్పుడు డీకే అరుణ, దివంగత నేత జైపాల్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి రాజకీయం చేసేవారు. వర్గపోరు ఎలా ఉన్నకాని గెలుపు విషయంలో కాంగ్రెస్ కు తిరుగుండేది కాదు. అలాంటి టైంలో డీకే అరుణ బీజేపీలో చేరటం, జైపాల్ రెడ్డి మరణించటంతో ప్రస్తుతం చుక్కాని లేని నావలా తయారైయింది అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఉండటానికి ఆ జిల్లాలో సీనియర్ నేతలు ఉన్నకాని డీకే అరుణ లాంటి బలమైన నేత కరువైయ్యాడు. మాజీ మంత్రి చిన్నారెడ్డి కేవలం వనపర్తి వరకే పరిమితం కావటం, నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ లోనే మకాం పెట్టటంతో సీనియర్ నేతలు పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా లేరని తెలుస్తుంది.

  సీనియర్ నేతలే పార్టీని ముందుండి నడిపించలేని స్థితిలో ఉంటే యువ నేతలైన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి లాంటి నేతలు పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అయినాసరే కింది స్థాయి నేతల్లో పార్టీ మీద నమ్మకం కలగటం లేదు. దీనితో మెల్ల మెల్లగా తెరాస పార్టీలోకి తట్టాబుట్టా సర్దుకునే పనిలో ఉన్నారు. డీకే అరుణ స్థాయిలో పార్టీని ముందుకు నడిపించగలిగిన సరైన నేత లేకపోవటంతో ఈ పరిస్థితికి కారణం. ఆమె బీజేపీలోకి చేరి ఏడాదికి పైగా అవుతున్న కానీ, ఆమెకి తగ్గ నేతను తయారుచేసుకోలేని హీనస్థితిలో కాంగ్రెస్ ఉన్నట్లు సృష్టంగా తెలుస్తుంది..ఒక రకంగా డీకే అరుణ దెబ్బకి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కోలుకోలేదన్నమాట… ఇక ముందు కోలుకుంటుందో లేదో చూడాలి..