కరోనా కాలంలో ఇండియన్స్ ఫేవరెట్ ఫుడ్ ఐటెంల జాబితాను ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తాజాగా వెల్లడించింది. చికెన్ బిర్యానీ భారతదేశానికి ఇష్టమైన వంటకంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2020లో సెకనుకు ఒక చికెన్ బిర్యానీ లాగించేశారట.
వెజ్, చికెన్, మటన్, ఆలూ ఇలా మొత్తంగా 2020లో ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీని అర్డర్లను అందుకున్నామని స్వీగ్గీ ప్రకటించింది. పన్నీర్ బటర్ మసాలా, మసాలా దోస, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ వంటి వంటకాలు భారతదేశానికి ఇష్టమైన పిక్-మీ-అప్ వంటకాలుగా ఉన్నాయి.
మూడు లక్షల మంది కొత్త వినియోగదారులు చికెన్ బిర్యానీని ఆర్డర్ చేయడం కోసమే స్విగ్గి యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారని వెల్లడించింది.హై-ఫైబర్ ఇడ్లీ, హై-ప్రోటీన్ కిచ్డీ, వేగన్ గ్రేవీ, లోఫ్యాట్ సలాడ్లు, కీటో-ఫ్రెండ్లీ శాండ్‌విచ్‌లు, గ్లూటెన్-ఫ్రీ ఐస్ క్రీమ్” లాంటి వంటకాలు స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లో 2020 లో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన ఆరు ఆరోగ్యకరమైన వంటకాలుగా నిలిచాయి