మూవీ రివ్యూ: స్వాతి ముత్యం

నటీనటులు: బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, రావు రమేష్, ప్రగతి తదితరులు

దర్శకత్వం : లక్ష్మణ్ కె కృష్ణ

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

సంగీతం: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: సూర్య

ఎడిటర్: నవీన్ నూలి

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. అయితే ఇంకా స్టార్ హీరో కాలేకపోయాడు. తాజాగా ఆయన రెండో కొడుకు గణేష్ హీరో గా ‘స్వాతిముత్యం’ సినిమా తో హీరో గా మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

బాలమురళీకృష్ణ (గణేశ్ బెల్లంకొండ) చాలా భోళా భాలా మనిషి. అమ్మాయిలంటేనే ఆమడ దూరం లా ఉంటాడు. తండ్రి వెంకట్రావ్ (రావు రమేష్) ఎలాగైనా తన కొడుక్కి పెళ్లి చేయాలనీ సంబంధాలు చూస్తో ఉంటాడు. కానీ ఏవో కారణాలతో కొన్ని సంబంధాలు తప్పుతాయి. అలా ఒక పెళ్లి చూపుల్లో భాగ్యలక్ష్మీ (వర్ష బొల్లమ్మ)ని చూస్తాడు బాలా.

మొదటి చూపులోనే నచ్చేస్తుంది. భాగ్యలక్ష్మీకి కూడా బాలా నచ్చేస్తాడు. అయితే ఇంకొద్ది సేపట్లో పెళ్లి అనగా బాలమురళీకృష్ణ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తోంది. దీనితో పెళ్లి ఆగిపోతుంది. ఏమిటీ ఆ రహస్యం?, ఆ తర్వాత బాలమురళీకృష్ణ జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి?, చివరకు బాలమురళీకృష్ణ – భాగ్యలక్ష్మి పెళ్లి చేసుకున్నారా, లేదా అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ ఈ కథను రాసుకోవడం సినిమాకి బాగా ప్లస్ అయింది. పాయింట్ కొత్తది కాదని దర్శకుడికి తెలుసు, కానీ ట్రీట్ మాత్రం బాగుంది. ఎమోషన్ తో పాటు కామెడీ స‌న్నివేశాలను కూడా లక్ష్మణ్ కె కృష్ణ బాగా రాసుకున్నాడు.

మొదటి సినిమా అయినా కానీ గణేష్ చాలా బాగా చేసాడు. ఎనర్జిటిక్ యాక్టింగ్ తో తన రోల్ లో  చాలా బాగా న‌టించాడు. కొన్ని సన్నివేశాల్లో గణేష్చా నటన లా సహజంగా ఉంది.

అలాగే హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా బాగా చేసింది. తన పాత్ర కూడా కామెడీగా సాగుతూ బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ మంచి స్టోరీ లైన్  తీసుకున్నా కానీ ఫస్ట్ హాఫ్ లో కొంత తడపడ్డాడు. ఫస్ట్ హాఫ్, సెకెండాఫ్ లో కొన్ని సీన్స్  చాలా సాగతీసినట్లు స్లోగా సాగుతాయి.

తీర్పు :

కొన్ని చోట్ల బోరింగ్ గా సాగినా కానీ ‘స్వాతి ముత్యం’ మాత్ర ఓవరాల్ గా ఆకట్టుకుంటుంది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వ పనితనం సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. రెండు పెద్ద సినిమాల మధ్య వచ్చిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ బాగానే అలరిస్తుంది.