Rana – Surya: నీది యాక్టింగ్ కాదురా అంటూ రానా కి క్లాస్ పీకిన సూర్య..?

Rana – Surya: పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ఈటీ. ఈ సినిమా మార్చి 10 న విడుదల కానుంది. ఈ తమిళ సినిమాను నారాయణదాస్ నారంగ్, డి సురేష్ బాబు, దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాదులో నిర్వహించారు చిత్ర బంధం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో రానా, దర్శకుడు బోయపాటి, గోపీచంద్ మలినేని హాజరయ్యారు.

ఇక ఈ ఈవెంట్ లో భాగంగా హీరో రానా మాట్లాడుతూ.. నా సినిమా ఒకటి ఎడిటింగ్ రూమ్ లో చూసిన సూర్య గారు.. నీది యాక్టింగ్ కాదురా.. సర్ చేస్తున్నావ్ అని క్లాస్ పీకారని తెలిపారు రానా. అయితే ఆ రోజు సూర్య పీకిన క్లాస్ నన్ను బల్లాలదేవుడిని చేసింది. డేనియల్ శేఖర్ ని చేసింది అని తెలిపాడు రానా. అనంతరం ఈటి సినిమా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. రజినీకాంత్ గారి తర్వాత సూర్య ని తెలుగు ప్రేక్షకులు మన అని అనుకుంటున్నారు.. అలాంటి సూర్య గారు చేసిన ఈ సినిమా విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను తెలిపాడు బోయపాటి.