Oscars List : బిగ్ న్యూస్ : ఆస్కార్ బరిలో సూర్య మరో సినిమా..కీలక వివరాలు ఇవే.!

 Oscars List :  గత ఏడాది నేరుగా ఓటిటి లో వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “జై భీమ్” కూడా ఒకటి. దర్శకుడు జ్ఞ్యానవేల్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ రియలిస్టిక్ కోర్ట్ డ్రామా మరోసారి భారతదేశ సినిమాని గర్వించదగేదిలా చేసింది.

అయితే ఈ చిత్రం ఇది వరకు గోల్డెన్ గ్లోబ్ ఇంటర్నేషనల్ సినిమాస్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే దీనికి ముందు సూర్య నటించిన చిత్రం “ఆకాశం నీ హద్దురా” కూడా అక్కడ వరకు వెళ్లడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత అవార్డు ఆస్కార్ వరకు కూడా వెళ్లి చివరి నిమిషంలో వెనక్కి వచ్చేసింది.

మరి ఇప్పుడు తన “జై భీమ్” కూడా ఆస్కార్ వరకు వెళ్లడం బ్రేకింగ్ న్యూస్ గా మారి ఇండియా మొత్తంలో వైరల్ అవుతుంది. 2022 ఆస్కార్ అవార్డ్స్ ఫిల్మ్ ఫీచర్స్ బెస్ట్ ఫారిన్ సినిమాల జాబితాలో జై భీమ్ కి చోటు దక్కింది. అంతేకాకుండా వేలాది సినిమాలు ఈ రేస్ లోకి రాగా వాటిలో 276 సినిమాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి.

మరి వాటిలో జై భీమ్ కూడా భారతదేశం నుంచి చోటు దక్కించుకోవడం మరోసారి ఇండియన్ సినిమాకి గర్వకారణంగా నిలిచింది. దీనితో ఈసారి అయినా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తుంది అని అభిమానులు సహా ఆడియెన్స్ చాలా బలంగా కోరుకుంటున్నారు.