మెగాస్టార్ కి పోటీగా సూర్యా..”ఆచార్య” డేట్ కే తన సినిమా కూడా

మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో బస్టర్ దర్శకుడు కొరటాల శివ తీసిన భారీ “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడు నుంచో ఆసక్తిగా చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే ఏడాదికి సోలో రిలీజ్ గా సెట్టయ్యింది.

అయితే ఈ సినిమాకి పోటీగా ఏ సినిమాలు కూడా లేవు కానీ ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య సరిగా మెగాస్టార్ సినిమా రిలీజ్ డేట్ కే పోటీకి వచ్చాడు. తమిళ్ లో దర్శకుడు పాండిరాజ్ తో తాను చేస్తున్న తాజా చిత్రం ‘ఎతరక్కుమ్ తునిందవన్’.

పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తాలూకా రిలీజ్ డేట్ ని చిత్ర బృందం ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4నే రిలీజ్ చేస్తున్నారట.

సూర్య సినిమాలు కోసం తెలుగులో కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోని మెన్స్ సినిమా అంటే ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంది. సో ఆచార్య సినిమాకి ఇది గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ..