ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రైనా ప్రస్తుతం తన ఫ్యామిలీతో ముంబైలో ఉన్నాడు. అయితే ఆయన రీసెంట్‌గా పబ్‌కు వెళ్ళాడు. ఆయన వెళ్లిన పబ్ కరోనా నిబంధనలు ఉల్లంఘించి నడిపిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో పబ్‌పై రైడ్ చేశారు. దీంట్లో 34 మంది సెలబ్రిటీలని అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ అయిన వారిలో క్రికెటర్ సురేశ్ రైనా, సింగర్ గురు రంధ్వానా కూడా ఉన్నారు.
ముంబై విమానాశ్రయం సమీపంలో ఉన్న సహర్ ప్రాంతంలో ఈ పబ్ ఉండగా, దీనిని నిర్ణీత సమయాన్ని మించి రన్ చేస్తున్నారు. అంతేకాదు పబ్‌లో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు పెట్టుకోవడం వంటివి ఎక్కడ కనిపించలేదు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగానే అరెస్ట్ చేసామని సహర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ముంబైలో రాత్రి 11.30 వరకే పబ్‌లకు తెరిచే పర్మిషన్ ఉన్నది. కానీ సహర్ ప్రాంతంలోని పబ్ తెల్లవారుజామున 4 గంటలకు కూడా తెరిచి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్ట్రెయిన్ వలన మహారాష్ట్రలో కర్ఫ్యూ నడుస్తుంది ఈ నేపథ్యంలో పబ్‌లని తొందరగా మూసివేయాలని చెప్పాం. ఈ తెల్లవారుజామున 2.50 నిమిషాలకు ముంబై పోలీసు శాఖకు చెందిన స్పెషల్ స్వ్కాడ్ తనీఖీ నిర్వహించడంతో వీరంతా దొరికారు అని పోలీసులు చెప్పారు.
డ్రాగన్‌ఫ్లై క్లబ్‌లో అరెస్ట్ అయితన మాజీ క్రికెటర్‌ను కొద్ది సేపటి తర్వాత బెయిల్‌పై రిలీజ్ చేశారు. 27 మంది కస్టమర్లు, ఏడు మంది సిబ్బందిపై ఐపీసీ 188 సెక్షన్, ముంబై పోలీసు చట్టం, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ నమోదు చేసి అరెస్టులు చేశారు. 18, 269, 34 ఐపీసీ సెక్షన్లతో పాటు ఎన్‌డీఎంఏ 51 సెక్షన్ కింద అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. జనవరి పదవ తేదీ నుంచి జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం రైనా యూపీ జట్టు తరపున ఆడనున్న విషయం తెలిసిందే.