బోలెడంత స్టార్ డమ్, మంచి టాలెంట్, ఆదరించడానికి సిద్ధంగా ఉన్న అభిమానులు.. ఒక యువ హీరోకు ఇంతకన్నా రిసోర్సెస్ అవసరం లేదు. ఇవన్నీ ఉంటే హీరోగా నిలదొక్కుకోవడం ఖాయం. కానీ అక్కినేని వారసుడు అఖిల్ విషయంలో ఈ లెక్కలేవీ వర్కవుట్ కావట్లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడ అనుకున్నట్టు జరగట్లేదు ఆయన సినిమాల విషయంలో. స్టార్ హీరో అయిపోదామని చేసిన మొదటి చిత్రం ‘అఖిల్’ డిజాస్టర్ కాగా రెండవ ప్రయత్నం ‘హలో’, మూడవ ప్రయత్నం ‘మజ్ను’ బెడిసికొట్టాయి. ఇక నాల్గవ ప్రయత్నంగా చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ ఎప్పుడో పూర్తయిన కూడ ఇంకా రిలీజ్ కాలేదు.
ఎప్పుడు రిలీజ్ డేట్ అనుకున్నా ఏదో ఒక అడ్డంకి. చివరికి అభిమానుల్లో సినిమా పట్ల ఆసక్తి సన్నగిల్లిపోతోంది. ఇక కొత్తగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమాకు ఓకే చెప్పాడు. అఖిల్ కోసమే కథ రాశానని, ఈ సినిమా అఖిల్ ను నిలబెడుతుందని సురేందర్ రెడ్డి అన్నారు. రామ్ చరణ్, చిరంజీవి, రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేసి హిట్లు అందుకున్న దర్శకుడు కావడంతో ఆయన మాటల మీద అక్కినేని అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. అంతా సక్రమంగానే జరుగుతోంది అనుకునే సమయానికి కథకు రిపేర్లు చేస్తున్నారనే వార్తలు మొదలయ్యాయి. కథకు రిపేర్లు అంటే కథ అక్కినేని కాంపౌండ్లో పాస్ కాలేదా అనే కొత్త డౌట్స్ పుడుతున్నాయు. దీంతో అఖిల్ సినిమా అంటే కష్టాలు తప్పవా అనుకుంటున్నారు ఫ్యాన్స్.