ఆ హీరోకు వంద ముద్దులు పెడతానంటున్న సురేఖ వాణి

తెలుగు సినిమాల్లో అక్క, వదిన పాత్రల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు నటి సురేఖ వాణి. వయసు పెరిగినా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ హీరోయిన్ లకు సైతం పోటీ ఇస్తున్నారు సురేఖ వాణి.

కొన్నాళ్ల క్రితం సురేఖ వాణి భర్త అనారోగ్యంతో మరణించారు. వీరికి సుప్రీత అనే కూతురు ఉంది. సుప్రీత కూడా ప్రస్తుతం మోడలింగ్ చేస్తోంది. తల్లి, కూతుర్లు సోషల్ మీడియా తమ డాన్సులతో హంగామా చేస్తుంటారు. త‌ల్లి, కూతురు ఇద్ద‌రు కలిసి పబ్బులకి వెళ్ళడంతో పాటు అక్కడ మందు గ్లాసులు పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఆ ఫోటోలను సోషల్ మీడియా లో సైతం షేర్ చేస్తారు.

అయితే సురేఖ వాణి రెండో పెళ్లిచేసుకుంటాడని కొన్ని వార్తలు వచ్చాయి…అయితే సురేఖ వాణి మాత్రం తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, కానీ బాయ్ ఫ్రెండ్ ఉంటె బాగుంటుందని అన్నారు. ఒకవేళ చేసుకుంటే భాగా డబ్బులు ఉన్నవాడు భర్తగా రావాలి అంటూ సిగ్గుపడింది. అలాగే త‌న‌ను బాగా చూసుకునే వాడు అయ్యి ఉండాల‌ని చెప్పింది.

సురేఖ‌ను ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకు వంద ముద్దులు ఇస్తారు అని అడగ్గా…ఏ మాత్రం తడుముకోకుండా పవన్ కళ్యాణ్ కు అయితే వంద ముద్దులు ఇస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సురేఖ వాణి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.