అదిరే అప్డేట్ : “డీజే టిల్లు” పార్ట్ 2 షూటింగ్ కి సిద్ధం డీటెయిల్స్ వైరల్..!

ఇప్పటివరకు మన తెలుగులో ఎన్నో సినిమాలు ఈ ఏడాదిలో వచ్చాయి కానీ థియేట్రికల్ గా సాలిడ్ ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమాలు మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణ టికెట్ ధరలతో వచ్చిన చిత్రాల్లో డబుల్ ప్రాఫిట్స్ ని ఇచ్చిన ఒకే ఒక చిత్రం “డీజే టిల్లు”. 

యువ దర్శకుడు విమల్ కృష్ణ టాలెంటెడ్ హీరో హీరోయిన్ లు సిద్ధు జొన్నలగడ్డ అలాగే నేహా శెట్టి లు నటించిన క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఇది. అంచాలను అందుకొని వాటికి మించి లాభాలను ఈ చిత్రం అందించింది. ఇంకా పైగా లాస్ట్ లో డీజే టిల్లు పార్ట్ 2 కూడా ఉందని తెలపడంతో ఆడియెన్స్ లో ఆ సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తి నెలకొంది. 

అయితే ఈ సినిమాపై ఊహించని విధంగా నిర్మాత నాగ వంశీ అదిరే అప్డేట్ ని అందించడం వైరల్ గా మారింది. తన నిర్మాణ సంస్థ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజ్ స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యి ఈ ఆగస్ట్ నుంచే షూటింగ్ కూడా రెడీగా ఉన్నట్టు అనౌన్స్ చేసేసారు. 

అయితే ఇక్కడ ఎక్కడా సినిమా పేరు మెన్షన్ చెయ్యలేదు కానీ అందరికీ మాత్రం ఆ సినిమానే అని అర్ధం అయ్యిపోయింది. దీనితో ఈ టాక్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది, ఇక ఈ సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే.