స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇష్టమైన వంటకాలు ఇవే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలతో కూడా సక్సెస్ సాధించగల సత్తా ఉంది. వాస్తవానికి సర్కారు వారి పాట సినిమాకు వచ్చిన టాక్ ను విని చాలామంది అభిమానులు మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలుస్తుందని భావించారు. సినిమాలో మంచి మెసేజ్ ఉన్నా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు సినిమాలో లేకపోవడం గమనార్హం.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇష్టమైన వంటకం ఏమిటనే ప్రశ్నకు హైదరాబాదీ బిర్యానీ అని సమాధానంగా వినిపిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గుత్తివంకాయ కూరను సైతం మహేష్ బాబు ఎంతో ఇష్టంగా తింటారని సమాచారం. సినిమాలతో పాటు ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు.

ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా విదేశాలకు వెళ్లడానికి మహేష్ బాబు ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట సినిమా ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎఫ్3 సినిమా విడుదలైనా సర్కారు వారి పాట కలెక్షన్లకు ఢోకా ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎఫ్3 సినిమా సర్కారు వారి పాటపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట పలు ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కాగా నైజాంలో మాత్రం మరో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాల్సి ఉంది. 120 కోట్ల రూపాయల టార్గెట్ తో ఈ సినిమా విడుదల కాగా ఇప్పటివరకు ఈ సినిమాకు 107 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.