సూపర్ స్టార్ మహేష్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించిన టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరనే సంగతి తెలిసిందే. కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తక్కువ సమయంలోనే నటుడిగా క్రేజ్ ను సంపాదించుకోవడంతో పాటు నటుడిగా పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు. వయస్సు పెరుగుతున్నా యంగ్ గా కనిపించే ఈ టాలీవుడ్ హీరో వరుసగా భరత్ అనే నేను సినిమా నుంచి విజయాలను అందుకుంటున్నారు.

మహేష్ కొడుకు, కూతురు కూడా భవిష్యత్తులో సినిమా రంగంలోనే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మహేష్ బాబు యాడ్స్ లో కూడా నటిస్తున్నారు. ఒకవైపు సూపర్ స్టార్ గా వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా కూడా మహేష్ బాబు సత్తా చాటుతున్నారు. మహేష్ బాబు స్టార్ట్ చేసిన ఏఎంబీ సినిమాస్ ఆయనకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తోంది.

మహేష్ ప్రస్తుతం నివాసం ఉన్న ఇంటి విలువ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది. మహేష్ బాబు ఇంట్లో డబ్బింగ్ స్టూడియో కూడా ఉందని బోగట్టా. తండ్రి కృష్ణ నుంచి మహేష్ బాబుకు భారీగానే ఆస్తులు దక్కాయని సమాచారం. పద్మాలయ స్టూడియోస్ విలువ 350 కోట్ల రూపాయలు అని ఇందులో మహేష్ బాబుకు కూడా వాటా ఉందని సమాచారం అందుతోంది.

మహేష్ బాబు దగ్గర ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. మహేష్ బాబు దగ్గర ఉన్న కార్ల విలువ 15 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం. మహేష్ బాబు దగ్గర లగ్జరీ క్యారవాన్ ఉండగా దీనికోసం మహేష్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. నమ్రత కూడా మహేష్ బాబుకు కట్నంగా తన పేరుపై ఉన్న ఆస్తులను బదిలీ చేశారని సమాచారం. మహేష్ మొత్తం ఆస్తుల విలువ 700 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని బోగట్టా.