Sunny Leone’s Game Plan : ఏంటిదంతా సౌత్‌లో క్యాష్ చేసుకునేందుకే.!

Sunny Leone’s Game Plan : సన్నీలియోన్‌ బాలీవుడ్‌లో ఓ స్టార్. పోర్న్ రంగం నుంచి వచ్చి బాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా ఎదిగింది. ఐటెం సాంగ్ చేసినా, హీరోయిన్‌గా చేసినా సన్నీ లెవలే వేరు. అదంతా బాలీవుడ్ సంగతి. ఇక సౌత్ విషయానికి వస్తే, ఆమెను ఓ శృంగార దేవతలా ఆరాధించేస్తారు.

 ఆ క్రేజ్‌నే తెగ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది సన్నీలియోన్. గతంలో కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో సన్నీలియోన్ నటించిన సంగతి తెలిసిందే.
అందుకోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంది సన్నీలియోన్. ఇక తాజాగా మరోసారి సౌత్ సినిమాపై సన్నీ దృష్టి పెట్టిందనిపిస్తోంది.

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో సన్నీలియోన్ నటిస్తోందట. ఈ సినిమా కోసం సన్నీలియోన్ 20 రోజులు కాల్షీట్లు ఇచ్చిందట. 20 రోజుల్లో షూటింగ్‌లో పాల్గొనేది 15 రోజులు మాత్రమే. మిగిలిన 5 రోజులు ప్రమోషన్స్‌ కోసమట.

ఈ 20 రోజులకు సంబంధించి అక్షరాలా రెండున్నర కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటోందట సన్నీలియోన్. సన్నీకే అంత భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారంటే, ఇక సినిమాకి ఎంత బడ్జెట్ ప్లాన్ చేసుంటారో కదా.

రిలీజ్ తర్వాత రిజల్ట్ సంగతేంటో మరి. ఆ సంగతి అటుంచితే, ఈ సినిమా కోసం చేయబోయే ప్రమోషన్స్ మాములుగా వుండబోవట. అందులోనూ సన్నీపాప పాల్గొనే ఈవెంట్స్ చాలా చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారట.

సినిమా సంగతెలా వున్నా, ప్రమోషన్స్‌తోనే ఈ సినిమాని ఊదరగొట్టేసేలా వున్నారంటూ నెటిజన్ల నుంచి సెటైర్లు వెల్లువెత్తుతున్నాయ్. కాగా,  ప్రస్తుతం శరవేగంగా సన్నీకి సంబంధించిన సీన్లు హైద్రాబాద్‌లో షూటింగ్ చేస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో మంచు విష్ణుకి జోడీ నటిస్తోంది. గాలి నాగేశ్వరరావు దర్శకుడు.