Sumanth: అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో నటుడు సుమంత్ ఒకరు. సుమంత్ హీరోగా ఎన్నో చిత్రాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఉన్నఫలంగా ఈయన కెరియర్ పరంగా వెనకబడిపోవడంతో ఇటీవల కాలంలో సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో హీరో సుమంత్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
సుమంత్ ఇదివరకే నటి కీర్తి రెడ్డిను పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ పెళ్లి అయిన వెంటనే విడాకులు తీసుకుని విడిపోయారు అయితే ఇప్పటివరకు సుమంత్ సింగిల్గానే ఉన్నారు. రెండో పెళ్లి మాత్రం చేసుకోలేదు కానీ కీర్తి రెడ్డి మాత్రం రెండో పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. అయితే సుమంత్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారని ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా హీరోయిన్ అంటూ ఒక వార్త సంచలనంగా మారింది.
ఈ వార్త తెరపైకి రావడానికి కారణం లేకపోలేదు హీరో సుమంత్ హీరోయిన్ మృణాల్ తో కలిసి చాలా చనువుగా ఉన్నటువంటి ఒక ఫోటో బయటకు రావడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది. ఇక ఈ వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సుమంత్ స్పందించారు ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఈ ఫోటో గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ సందర్భంగా సుమంత్ స్పందిస్తూ నేను సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాను నా గురించి సోషల్ మీడియాలో ఏం వస్తుందో కూడా నేను తెలుసుకోనని అలాగే ఇప్పుడు మీరు అడుగుతున్న ఫోటో కూడా దేని గురించి అడుగుతున్నారో నాకు తెలియదు అంటూ సుమంత్ తెలిపారు. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని సింగిల్ లైఫ్ హ్యాపీగా గడుపుతున్నానని పరోక్షంగా హీరోయిన్ తో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. ఇలా ఆ ఫోటో గురించి సుమంత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.