Sumanth: ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని హీరో… కలిసి నటిస్తే పెళ్లి చేసేస్తారా?

Sumanth: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి చనువుగా కనిపించిన లేదా పలు సినిమాలలో వరుసగా నటించిన వారిద్దరి మధ్య ఏదో ఉందని పెళ్లి చేసుకోబోతున్నారని నేటిజన్ లు ప్రకటించేస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కినేని హీరో పరిస్థితి కూడా ఇలాగే ఉందని చెప్పాలి. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న వారిలో సుమంత్ ఒకరు.

ఎన్నోఅద్భుతమైన సినిమాలలో నటించిన సుమంత్ తదుపరి వరుస ఫెయిల్యూర్ అందుకోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే నటి కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్నారు అయితే పెళ్లయిన ఏడాదికే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.

ఇలా కీర్తి రెడ్డి సుమంత్ నుంచి విడిపోయి అనంతరం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో విదేశాలలో స్థిరపడి ఉన్నారు కానీ సుమంత్ మాత్రం ఇప్పటివరకు రెండో పెళ్లి చేసుకోలేదు. దీంతో ఈయన రెండో పెళ్లి గురించి తరచూ వార్తలు వినపడుతూనే ఉన్నాయి. సుమంత్ పెళ్లికి సంబంధించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈయన ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

మరి సుమంత్ పెళ్లాడబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్. వీరిద్దరూ కలిసి సీతారామం సినిమాలో నటించారు. అయితే ఇందులో సుమంత్ ఒక నెగిటివ్ పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి పరిచయం పెరిగిపోయిందని అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఒక ఫోటో వైరల్ గా మారింది ఈ ఫోటోలో ఈ జంట చాలా చనువుగా కనిపించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవటం నిజమేనంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి సుమంత్ మృణాల్ పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.