సుకుమార్ ‘పుష్ప’ చిత్రాన్ని ఆషామాషీగా తీయట్లేదు. తనలో ఉన్న మాస్ మసాలా యాంగిల్ మొత్తాన్ని బయటకు తీసి చేస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఆయన అంతకుమించి ఉండేలా ‘పుష్ప’ను తీర్చిదిద్దుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత వ్యయంతో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ పెడుతున్న ఖర్చు 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ వంద కోట్లలో 40 కోట్లు బన్నీ మీద యాక్షన్ సన్నివేశాలను తీయడానికే ఖర్చు చేస్తున్నారట.
ఇప్పటికే చిన్నపాటి టీజర్ ఒకటి వదిలి సినిమా ఎలా ఉండబోతోంది శాంపిల్ చూపించారు సుకుమార్. చూస్తే సినిమాలో యాక్షన్ కంటెంట్ హెవీగా ఉంటుందని ఇట్టే అర్థమవుతోంది. చిత్రంలో మొత్తం ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. అన్నీ అడవుల్లో జరిగేవే. కొన్ని నైట్ ఎఫెక్ట్ ఫైట్స్ అయితే ఇంకొన్ని ఛేజింగ్ ఫైట్స్. వీటి కోసం అధునాతన టెక్నాలజీని, పరికరాలను, వందల సంఖ్యలో ఆర్టిస్టులను వాడారట. ఇవన్నీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయని, బన్నీ క్రేజ్ రెట్టింపయ్యేలా చేస్తాయని తెలుస్తోంది. మొత్తానికి సినిమా బడ్జెట్లో సగం బన్నీకి హైప్ ఇవ్వడానికే వాడేస్తున్నారు సుకుమార్. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయికి చేరుకోవాలనేది బన్నీ లక్ష్యం.