Director Sukumar : బ్రేకింగ్:  ‘తగ్గేదే లె..’ అంటోన్న సుక్కు – బన్నీ.. ఏం చేస్తారంటే.!

Director Sukumar : క్రియేటివ్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా సంచలనం విజయం అందుకుంది. ఈ సినిమా వచ్చి చాలా కాలమే అయినా, ఏదో ఒక మూల నుంచి ‘పుష్ప’ మేనియా మాత్రం తగ్గనే తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఈ సినిమాలో సాంగ్స్ వైరల్ అవుతూనే వున్నాయ్.
అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నామంటూ ముందే చెప్పాడు సుకుమార్. ‘పుష్ప – ది రైజ్’ పేరుతో మొదటి పార్టు రిలీజ్ చేశారు. ‘పుష్ప ది రూలింగ్’ పేరుతో సెకండ్ పార్ట్ సిద్ధమవుతోంది.
అయితే, ఇక్కడితో ‘పుష్ప’ ఆగేదేలేదంట. దీన్నిఓ సిరీస్‌లా వదలబోతున్నారట. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ తర్వాత మూడు, నాలుగు, అలా ఇంకా చాలా పార్టులుండబోతున్నాయనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్. అయితే, ‘పుష్ప’ సెకండ్ పార్ట్ రిలీజ్ తర్వాత అది డిసైడ్ చేయబోతున్నారట.
‘పుష్ప’ పార్ట్ 1 లో సెకండ్ పార్ట్ కోసం చిన్న సస్పెన్స్ వదిలి పెట్టారు. అలాగే, సెకండ్ పార్ట్‌లోనూ థర్డ్ పార్ట కోసం షాకింగ్ సస్పెన్స్‌ని ప్లాన్ చేశారట. మొదటి పార్ట్‌కి మించి ఈ సినిమా క్లైమాక్స్ వుండబోతోందట. ఇక శుభం కార్డు పడ్డాకా వదిలే ఆ సస్పెన్స్‌తో మూడో పార్ట్‌పై అనూహ్యంగా అంచనాలు పెరగనున్నాయని అంటున్నారు. అంత ఉత్కంఠమైన సస్పెన్స్ ఏం ఇవ్వబోతున్నాడో మన లెక్కల మాస్టారు సుకుమార్ చూడాలి మరి.