Director Geeta Krishna: సుహాసినిని, చిరంజీవిని స్క్రీన్‌పైన చూడలేకపోయారు.. కమల్ హాసన్ 100% బెస్ట్… డైరెక్టర్ గీథా కృష్ణ..!

Director Geeta Krishna: తమిళ్‌లో రాబర్ట్, రాజశేఖర్ అనే డైరెక్టర్లు ఇద్దరు కలిసి ఓ సినిమా తీశారని దర్శకుడు గీతా కృష్ణ అన్నారు. అదే సినిమాను తెలుగులో వంశీ, చిరంజీవితో చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అప్పటికి చిరంజీవి పెద్ద స్టారేం కాదని, అప్పుడప్పుడే పైకి వస్తున్నాడని ఆయన అన్నారు. ఇకపోతే గోడ మీద కూర్చొని సైట్ కొడుతున్నట్టూ సాగే ఆ సినిమాను నిజంగా చాలా బాగా తీశారని ఆయన తెలిపారు. ఆ సినిమాను రాబర్ట్ రాజశేఖర్ బాగా చిత్రీకరించారని, అంతే కాకుండా ఆయన తన స్నేహితుడని, ఇప్పుడు లేరు చనిపోయారని ఆయన వివరించారు. ఆ సినిమాకి శంకర్ గణేష్‌ కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారని ఆయన చెప్పారు. పాకిస్థాన్ గజల్ పెట్టారని, అదే పాటను తెలుగులోనూ పెట్టారని, దానికి అవార్డు రావడం అనేది పెద్ద జోక్ అని ఆయన అన్నారు.

ఇకపోతే తెలుగులో తీసినా ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ కూడా ఓ క్యారెక్టర్ అని, సుహాసిని డెత్ బెడ్‌పై ఉన్నపుడు అందరితో పాటు చిరంజీవి కూడా ఏడుస్తాడని, ఆ సినిమా నిజంగా ఫ్లాప్ కావడానికి అదే ముఖ్య కారణమని ఆయన నొక్కి చెప్పారు. ఆ చిత్రం ఫైనల్‌గా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ అయిందని, ఎందుకు అంటే చిరంజీవి ఏడ్వడం వల్లనే అని ఆయన చెప్పారు. అంటే ఆ రోజు జనాలు చిరంజీవి ఏడ్వడాన్ని చూడలేకపోయారని ఆయన అన్నారు .

చిరంజీవి అంటే డ్యాన్స్, ఫైట్స్ అలాంటి వాటికే జనాలంతా అలవాటు పడిపోయారని గీతా కృష్ణం చెప్పారు. అపద్భాందవుడు ఏదో ఆడిందని, స్వయం కృషిలో కూడా చెప్పులు కుట్టే వాడిగా పెట్టడం కూడా ఏం బాలేదని ఆయన అన్నారు. చిరంజీవిని పెట్టి ఏదో కొత్తగా తీయాలనేం రూల్ లేదని, ఆ ప్లేస్‌లో కమల్‌ హాసన్‌ని పెట్టి ఆ చెప్పులు కుట్టే క్యారెక్టరే ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కానీ అదే కమల్ హాసన్‌తో గోచీ పెట్టుకునే క్యారెక్టర్ ఇచ్చి భారతీ రాజా సినిమా తీశారని, అందరు డైరెక్టర్ల కంటే ఆయనే గ్రేట్ ఆని గీతా కృష్ణ ప్రశంసించారు. అతను మోస్ట్ డీ గ్లామర్‌డ్ క్యారెక్టర్‌ ఇచ్చాడని, అదీ క్యారెక్టర్ అంటే అని ఆయన చెప్పారు. చూసి ఎవరైనా చేస్తారని, ఆ విషయంలో కమల్ హాసన్ చాలా గ్రేట్ అని ఆయన తెలిపారు.