Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ కార్యక్రమంతో సక్సెస్ అందుకున్న ఈయనకు వరుసగా బుల్లి తెర కార్యక్రమాలలో నటించే అవకాశం మాత్రమే కాకుండా యాంకర్ గా పలు కార్యక్రమాలకు వ్యవహరిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అలాగే హీరోగా కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటు సుధీర్ స్టార్ సెలెబ్రెటీగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సుడిగాలి సుధీర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఈయన చేసిన స్కిట్ వల్ల వివాదంలో నిలబడమే కాకుండా సుడిగాలి సుధీర్ తీరు పట్ల హిందూ సంఘాలు సైతం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరి ఈయన చేసినటువంటి ఆ తప్పిదం ఏంటి అనే విషయానికి వస్తే…
సుధీర్ ఓ కార్యక్రమంలో స్కిట్ చేస్తూ నంది కొమ్ములలో నుంచి హీరోయిన్ రంభను చూస్తున్న విధంగా స్కిట్ చేశారు. అయితే ఈ స్కిట్ పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.శివుడు అంటే తమాషాలా? నంది కొమ్ములోంచి చూస్తే శివుడు కనిపించాలి కానీ… మీ పైత్యం కాదు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. సుధీర్ తో పాటు, ఈ షో చూస్తున్న వారందరూ కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈ విషయంపై మరి కొంతమంది కూడా తమ వాదనను వినిపిస్తున్నారు సుదర్ ఈ స్కిట్ సొంతంగా చేసింది కాదని తెలిపారు.బావగారు బాగున్నారా’ సినిమాలో ఓ సీన్. అందులో రంభ – చిరంజీవి మధ్య ఈ సీన్ డిజైన్ చేశారు. ఈ సినిమా ఇంట్రవెల్ బ్యాంగ్ ఇది. అప్పట్లో థియేటర్లో క్లిక్ అయ్యింది. సుధీర్ చేసిన ఈ షోలో రంభ గెస్ట్ కావడంతో ఇదే సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని తెలుపుతున్నారు. అయినా అప్పట్లో ఈ సీన్స్ చిరంజీవి చేస్తే ఎలాంటి వివాదాలు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం వివాదాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో సోషల్ మీడియా ఇంత అభివృద్ధి చెందకపోవడంతో ఈ సన్నివేశాలు గురించి బహుశా ఎవరికీ అవగాహన లేదని చెప్పాలి అయితే ప్రస్తుతం మాత్రం ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో హిందూ సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.