కొన్ని కథలను కొంతమంది హీరోలు నమ్మలేరు. అది హిట్టా ఫట్టా అనేది జడ్జ్ చేయలేరు. మంచి కథలను కూడ నమ్మకం కుదరక వదిలేసుకుంటుంటారు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేసిన ఆ కథేలే వేరే హీరోలు చేస్తుంటారు. అవి బ్లాక్ బస్టర్ హిట్లు అవుతుంటాయి. ఊహించని విజయాన్ని అందుకుని రిజెక్ట్ చేసిన హీరోలకు షాకిస్తుంటాయి. అలా మంచి మంచి కథలను వదిలేసుకొని తర్వాత వాటి రిజల్ట్ చూసి అయ్యో.. చేయలేకపోయామే అని బాధపడుతుంటారు. ప్రస్తుతం హీరో సుధీర్ బాబు పరిస్థితి అదేనట. ఆయన రిజెక్ట్ చేసిన కథే ఇప్పుడు నేషనల్ అవార్డులు సాధించింది.
ఆ చిత్రం మరేదో కాదు.. ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని లీడ్ రోల్ చేశారు. కమర్షియల్ గా చిత్రం పర్వాలేదనిపించుకున్నా పేరు మాత్రం బాగానే వచ్చింది. ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నేషనల్ అవార్డు పొందింది. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో కూడ జాతీయ పురస్కారాన్ని అందుకుంది. గౌతమ్ తిన్ననూరి ఈ కథను నానికి వినిపించడాని ముందే సుధీర్ బాబు వద్దకు తీసుకెళ్లారట. కానీ సుధీర్ బాబు మాత్రం కథ వర్కవుట్ అవుతుందా లేదా అనే అనుమానంతో ఓకే చేయలేదు. నాని మాత్రం విన్న వెంటనే ఓకే చెప్పేశారు. ఫైనల్ రిజల్ట్ సూపర్.. రెండు నేషనల్ అవార్డులు. మరిప్పుడు సుధీర్ బాబు ఈ ఫలితాన్ని చూసి అయ్యో.. మంచి సినిమాను వదులుకున్నామే అని ఫీలవ్వకుండా ఉంటాడా.