Ram Charan And Yash : సడెన్ గా చరణ్, యష్ లకి యుద్ధం..అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయ్యిందంటే.?

Ram Charan And Yash : ఇప్పుడు దక్షిణాది సినిమా టోటల్ ఇండియన్ సినిమా దగ్గర తిరుగు లేని ఇండస్ట్రీ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే జస్ట్ కొద్ది వారాల కితమే భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ అయ్యి అదరగొట్టగా దీని తర్వాత మళ్ళీ అన్నే అంచనాలు నెలకొల్పుకుని వచ్చిన మరో భారీ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”.
అయితే ఈ రెండు సినిమాల్లో కూడా ఉన్న మెయిన్ హీరోలు ఇద్దరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు కాగా రాకింగ్ స్టార్ యష్ ల పేర్లు ఇండియన్ సినిమా దగ్గర గట్టిగా మాట్లాడుకుంటున్నారు.
అలాగే ఈ ఇద్దరి హీరోలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయని ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటారని ఇంకా కేజీఎఫ్ ఫస్ట్ భాగం వచ్చినపుడు కూడా చాలా మంది ఈ సినిమా చూసినపుడు రామ్ చరణ్ నే గుర్తుకు వచ్చాడని అన్నారు.
అయితే ఇప్పుడు సడెన్ గా సోషల్ మీడియాలో ఇద్దరు హీరోలు కి యుద్ధం అన్నట్టు రామ్ వర్సెస్ యష్ అనే ట్యాగ్ ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అయితే ఇది చాలా మందికి అర్ధం కాక కూడా హాట్ టాపిక్ అవుతుండగా దీనికి కారణం తెలుస్తుంది.
ఇది కావాలని ప్లాన్డ్ గా జరుగుతుంది కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఇద్దరి మధ్య కావాలనే ఈ ట్రెండ్ చెయ్యాలని పలు గ్రూప్స్ లో మెసేజ్ లు వస్తున్నాయని అంటున్నారు. మరి ఇవి ఎవరు చేయిస్తున్నారో అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.