Avika Gor’s Friends List : ‘ఉమాదేవి’గా ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో పెద్ద తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ అవికాగోర్. అంతకు ముందే ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు ఈ అందాల భామ.
ఫస్ట్ సినిమాకే సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ భామ తొలి సినిమా హీరో అయిన రాజ్ తరుణ్‌తో ‘సినిమా చూపిస్త మామ’ అంటూ రెండో సారీ స్క్రీన్ షేర్ చేసుకుంది. హిట్ కొట్టింది. అయితే ఆ తర్వాత పాపకి లక్కు కలిసి రాలేదు. బాలీవుడ్‌కి చెక్కేసింది.
అక్కడ అడపా దడపా సినిమాలతో పాటు, సీరియల్స్‌తో మళ్లీ బిజీ అయిపోయింది.
సరే, అసలు విషయానికి వస్తే, అమ్మడి బాయ్ ఫ్రెండ్స్ లిస్టు చూస్తే చాలా చాలా పెద్దదే. పలువురు సీరియల్ నటులతోనే చెట్టా పట్టాలేసుకుని తిరిగింది. అందుకు సంబంధించి, క్లోజ్ ఫోటో షూట్లను సోషల్ మీడియాలో షేర్ చేసేది.
అయితే, సడెన్‌గా ఓ రోజు నా కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు మిలంద్.. అంటూ అనౌన్స్ చేసి నెటిజన్లకు షాకిచ్చింది. అయితే, అంతకు ముందే టాలీవుడ్‌లో రాజ్ తరుణ్‌తోనూ అవికా గోర్‌కి ఎఫైర్ వుందనీ, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనీ, రాజ్ తరుణ్ అందుకోసం ఓ కొత్త ఫ్లాట్ కూడా తీసుకున్నాడనీ, హాట్ హాట్ కథనాలు వెల్లువెత్తాయి.
అయితే అదంతా ఉత్తదే అని ఈ జంట కొట్టిపారేశారనుకోండి.
అవికా గోర్ బాలీవుడ్ ఎఫైర్స్ మాత్రం ఇంకా ఇప్పటికీ అలా నడుస్తూనే వున్నాయ్. ఓ పక్క ఈ ఎఫైర్స్‌ని ఎంజాయ్ చేస్తూనే, మరోపక్క కెరీర్‌లోనూ బ్రేకుల్లేకుండా ముందుకెళ్లిపోతోందీ ముద్దుగుమ్మ. అయితే, పెద్ద తెరపై అంతంత మాత్రమే అయినా బుల్లితెరపై అవికా క్వీన్ అనే చెప్పొచ్చేమో.!