Liger Movie : పూరి – విజయ్ ల “లైగర్” స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరో కన్ఫర్మ్..మంచి ఫిగర్ నే పట్టారు.!

Liger Movie : ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచే అనేక సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళుతున్నాయి. ఒకదాన్ని మించి చిన్న చితకా తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాలు పాన్ ఇండియా వైపే అడుగులు వేస్తున్నాయి. మరి అలా రిలీజ్ కి రెడీ అవుతున్న లేటెస్ట్ చిత్రాల్లో మాస్ అండ్ డ్యాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన చిత్రం “లైగర్” కూడా ఒకటి.

మరి రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసేసుకున్న ఈ భారీ చిత్రం పై లేటెస్ట్ ఇన్ఫో ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఓటిటి డీల్ కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేశారట.

అయితే ఈ సినిమాకి గాను అమెజాన్ వారు ఏకంగా 60 కోట్లు ఆఫర్ చేశారట. ఇది ఈ సినిమాకి మంచి ఫిగర్ అనే చెప్పాలి. అలాగే బహుశా విజయ్ కెరీర్ లోనే ఇది బిగ్ డీల్ కూడా కావచ్చు. టోటల్ గా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని వచ్చే ఆగష్టు 25న భారీ లెవెల్లో రిలీజ్ కానుంది.