తమిళ్, తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు విశాల్. అవ్వడానికి తెలుగు వాడు అయినా కానీ విశాల్ చెన్నై లో సెటిల్ అయిపోయాడు. తమిళ్ లో హీరో గా పరిచయమైనా విశాల్ దుబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు లో కూడా బాగా పాపులర్ అయ్యాడు.
అయితే తాజాగా ఈ యాక్షన్ హీరో ఇంటిపై కొందరు దుండగులు ఆయన నివాసంపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో విశాల్ ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎర్ర కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు విశాల్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ఆ తర్వాత అదే కార్ లో పారిపోయారు. దాడి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
విశాల్ మేనేజర్ దాడి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ దాడి ఎవరు చేసారు అన్నది ఇంకా తెలియలేదు.
తమిళ పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘంపై తెలుగువాడైన విశాల్ ఆధిపత్యాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. అలాగే నిర్మాణ సంస్థ లైకా తో విశాల్ కి వివాదం నడుస్తుంది. లైకా సంస్థ విశాల్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ హైకోర్ట్ లో పిటిషన్ వేసింది. ఈ దాడి ఎవరూ చేయించారో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందేమో