సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్టార్ హీరో మాజీ భార్య

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం తరచూ జారుతూ ఉంటుంది. నదియ, సంగీత, మీనా, ఆమని ఇలా అప్పటి హీరోయిన్స్ మంచి సపోర్టింగ్ పాత్రల్లో కనిపిస్తూ ఉన్నారు.

తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ పై ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ‘బద్రి’ సినిమాతో పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘జానీ’ సినిమాలో నటించిందని. ఆ తర్వాత యాక్టింగ్ కి స్వస్తి చెప్పింది.

దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ర‌వితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ సినిమాలో రేణు దేశాయ్‌ కీలక పాత్రలో నటిస్తున్న తెలుస్తుంది.

ఈ సినిమా గురించి రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. “హేమలత లవణం గారి వంటి స్ఫూర్తిదాయకమైన పాత్రలో నేను బాగుంటాను అని నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశీకృష్ణకు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చింది.

‘క్రాక్’ సినిమా తర్వాత వచ్చిన ‘ఖిలాడీ’, ‘రామా రావు ఆన్ డ్యూటీ’ సినిమాలు నిరాశపరచడం తో రవి తేజ హోప్స్ అన్ని ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో అయినా రవి తేజ హిట్ అందుకుంటాడేమో చూడాలి.