పుష్ప 2  ఐటెం సాంగ్ లో నటించే స్టార్ హీరోయిన్….

డైరెక్టర్ సుకుమార్ కి ఐటెం సాంగ్స్ అంటే పిచ్చి. ఆయన సినిమాల్లో ఒక ఐటెం సాంగ్ ఉండేలా చూస్తాడు, అవి హిట్ కూడా అవుతాయి. ‘అ అంటే అమలాపురం’, ‘రింగ రింగ’, ‘ఉ అంటావా మావ’ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ‘పుష్ప’ లో సమంత చేసిన ఐటెం సాంగ్ అయితే ఇప్పటికీ అందర్నీ అలరిస్తూనే ఉంది.

సుకుమార్ డైరెక్టర్ కు అల్లు అర్జున్ యాక్షన్ కు ‘పుష్ప’ సినిమాకు ఇండియా మొత్తం ఫాన్స్ అయ్యారు.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా ఇంకా పుష్ప పాటలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నాయి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

అయితే ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన ఐటెం సెకండ్ పార్ట్ లో ఎవరు చేయబోతున్నారు అనే ఆత్రుత అందరిలో ఉంది. ఈ సాంగ్ కోసం కాజల్, మలైకా అరోరా పేర్లు వినిపించాయి, కానీ తాజా సమాచారం ప్రకారం తమన్నా ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.