Remakes Trend : ఆ రీమేక్‌పై కన్నేసిన స్టార్ హీరోలు: దక్కించుకునేదెవరంటే.!

Remakes Trend : ప్రస్తుతం రీమేకుల ట్రెండ్ నడుస్తోంది టాలీవుడ్‌లో. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేకుల మీదే ఫోకస్ పెట్టారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు అన్నదమ్ములూ పోటా పోటీగా రీమేక్ సినిమాల్లో నటించేస్తున్నారు. ఆ మాటకొస్తే, విక్టరీ వెంకటేష్ కూడా తక్కువేం కాదనుకోండి. వెంకీ నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం’ సినిమాలు ఆ జాబితాలోనివే.

కాగా, ప్రస్తుతం ఓ సూపర్ హిట్ మలయాళ రీమేక్ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ నటించిన ‘బ్రోడాడి’ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. ఈ రీమేక్‌లో నటించాలని చాలా మంది స్టార్ హీరోలు అనుకుంటున్నారు. వెంకటేష్, నాగార్జునతో పాటు, చిరంజీవి కూడా ఈ లిస్టులో వున్నారు.

నాగ్, తన కొడుకులు నాగచైతన్య, అఖిల్‌తో కలిసి ఈ రీమేక్ చేయాలనుకుంటున్నారట. అలాగే, మెగాస్టార్ చిరంజీవి కోసం ఆల్రెడీ ఈ రీమేక్ లాక్ అయిందనే వార్తలు కూడా వున్నాయ్. రానా లేదా చైతూతో  కలిసి,  విక్టరీ వెంకటేష్ చేయాలన్న యోచనలో వున్నాడట. ఇంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ రీమేక్ మూవీ చివరికి ఎవరి చేతికి చిక్కుతుంతో.. అంటూ టాలీవుడ్ జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ లోగా ఈ ప్రాజెక్టు దాదాపు మెగాస్టార్ చేతికి చిక్కిందనే టాక్ వినిపిస్తోంది. మోహన్‌లాల్ బాడీ లాంగ్వేజ్‌ని మ్యాచ్ చేయడం చిరంజీవికి అయితేనే బాగా సెట్ అవుతుందని ఫిలింగ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయట. చూడాలి మరి, ఏం జరుగుతుందో. అన్నట్లు తమిళ హీరో పృథ్వీ రాజ్ ఒరిజినల్ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమా డైరెక్టర్ ఎవరో ఇంకా కన్ఫామ్ కావల్సి వుంది.