స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తొలి రెమ్యునరేషన్ అంత తక్కువా?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన వెంకటేష్ ఎఫ్3 సినిమాతో ఈ ఏడాది మరో సక్సెస్ ను సాధించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. 1986 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. అయితే ఈ సినిమా కంటే ముందు రామానాయుడు ప్రేమ్ నగర్ సినిమాలో నటించారు.

ప్రేమ్ నగర్ సినిమా కోసం వెంకటేష్ అప్పట్లోనే 1,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అయితే వెంకటేష్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ ఆ సమయానికి ఎక్కువ మొత్తమే కావడం గమనార్హం. ప్రస్తుతం వెంకటేష్ ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఎఫ్3 సినిమా కొరకు ఈ మొత్తం వెంకటేష్ కు పారితోషికంగా దక్కిందని సమాచారం అందుతోంది.

వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా బడ్జెట్, మార్కెట్ పరంగా ఈ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వెంకటేష్ సైతం స్టార్ డైరెక్టర్లతో పోల్చి చూస్తే యంగ్ డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. వెంకీ ఖాతాలో వరుస విజయాలు చేరుతున్నాయి. ప్రయోగాత్మక కథల్లో, మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి వెంకటేష్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

విక్టరీ వెంకటేష్ కెరీర్ పరంగా మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. వెంకటేష్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ తన నటనతో మెప్పిస్తున్నారు. వెంకటేష్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. ఇతర హీరోలను కూడా ఎంతో గౌరవించే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు కావడం గమనార్హం.