కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు అన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొన్నేళ్లలో నటించిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. వయస్సు పెరుగుతుండటంతో పాటు వయస్సుకు తగిన పాత్రలు రాకపోవడంతో మోహన్ బాబు సినిమాల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి ఊహించని స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి నెగిటివ్ గా ట్రోల్స్ ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందో లేక వ్యూస్ ఆధారంగా డబ్బులను చెల్లించనుందో క్లారిటీ రావాల్సి ఉంది. మోహన్ బాబు ఈతరం ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంపిక చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా రంగంలో ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా మోహన్ బాబు అడుగులు వేశారు.

అయితే ఈ మధ్య కాలంలో మోహన్ బాబు నిర్మించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా అయితే దాదాపుగా లేవని చెప్పాలి. అయితే సినిమాల ద్వారా మోహన్ బాబు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. మోహన్ బాబు మొత్తం ఆస్తుల విలువ 356 కోట్ల రూపాయలు అని సమాచారం. మోహన్ బాబుకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయని వాటి విలువ భారీగానే ఉందని బోగట్టా. మోహన్ బాబు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టగా ఏడాదికి 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల వరకు అలా సంపాదిస్తున్నారు.

సొంత ఊరిలో మోహన్ బాబుకు 3 కోట్ల రూపాయల ఖరీదైన ఇల్లు ఉందని తెలుస్తోంది. మోహన్ బాబు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా వాటి గురించి ప్రచారం చేసుకోవడం లేదు. మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు విద్య అందేలా చేస్తున్నారు. మంచికి మారుపేరుగా మోహన్ బాబు ఎంతోమందికి సాయం చేస్తుండటం గమనార్హం.