అల్లు అర్జున్ సినిమాల్లోకి వచ్చాక అన్ని వందల కోట్లు సంపాదించారా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమా కోసం బన్నీ ఈ మొత్తం రెమ్యునరేషన్ గా అందుకున్నారు. పుష్ప ది రైజ్ కోసం 40 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకున్న ఈ స్టార్ హీరో ఆ సినిమా సక్సెస్ కావడంతో రెమ్యునరేషన్ ను రెట్టింపు చేశారు.

అయితే సినిమాల ద్వారా ఈ స్టార్ హీరో వందల కోట్ల రూపాయలు సంపాదించారని సమాచారం అందుతోంది. పుష్ప ది రైజ్ సక్సెస్ తో హిందీ ప్రేక్షకులు కూడా బన్నీ భవిష్యత్తు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అరవింద్ ఇప్పటికే కొడుకులకు ఆస్తులను పంచేశారని ఫలితంగా బన్నీ ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ కు 400 కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉండవచ్చని సమాచారం.

బన్నీ కొన్నేళ్ల క్రితం కొత్తగా ఇల్లు కట్టుకోగా ఆ ఇంటి విలువ 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది. మలయాళంలో కూడా బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంచనాలకు మించి ఉంది. బన్నీ దగ్గర 5 కార్లు ఉన్నాయని ఈ కార్లలో ఖరీదైన రేంజ్ రోవర్ కారు కూడా ఉందని సమాచారం. కొన్ని నెలల క్రితం బన్నీ రేంజ్ రోవర్ హై ఎండ్ కారును కొనుగోలు చేశారు.

ఈ కారు విలువ 2.3 కోట్ల రూపాయలు అని సమాచారం. బన్నీ నిదానంగానే సినిమాలలో నటిస్తున్నా ఆ ప్రాజెక్ట్ లతో విజయాలు దక్కేలా జాగ్రత్త పడుతున్నారు. 20 ఏళ్ల సినీ కెరీర్ లో బన్నీ కేవలం 20 సినిమాలలో మాత్రమే నటించడం గమనార్హం. బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. బన్నీని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.