బాలయ్య సినిమా.. పూనకాలు వచ్చేలా కొట్టేస్తాడట

SS Thaman scoring great music for Akhanda
SS Thaman scoring great music for Akhanda
టాలీవుడ్లో మంచి ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్.  అప్పుడప్పుడు కాపీ అనే విమర్శలు వచ్చినా అన్నింటినీ దాటుకుని మోస్ట్ వాంటెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు తమన్. మాస్ జనాలకు ఏం కావాలో తమన్ కు బాగా తెలుసు.  అందుకే అతని పాటలకు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు అంత ఫ్యాన్ బేస్ ఉంది.  ముఖ్యంగా హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో తమన్ సంగీతం ఊపు తెప్పించేలా ఉంటుంది.  ఇటీవల వచ్చిన ‘వకీల్ సాబ్’ సినిమాలో తమన్ సంగీతానికి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం తమన్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి.  
 
వాటిలో బాలకృష్ణ చేస్తున్న ‘అఖండ’ సినిమా కూడ ఉంది. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటే ఎలివేషన్స్ ఏ లెవల్లో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇక వీరిద్దరికీ తమన్ నేపథ్య సంగీతం తోడైతే అభిమానులకు ఫీస్టే. తమన్ కూడ అదే అంటున్నాడు. బోయపాటి విజువల్స్, బాలయ్య హీరోయిజానికి పూనకాలు వచ్చేలా మ్యూజిక్ కొడతానని అంటున్నారు. తమన్ స్టేట్మెంట్స్ విని బాలకృష్ణ అభిమానులు ఉబ్బితబ్బిబైపోతున్నారు.  ఇలా బాలకృష్ణ తదుపరి సినిమాకు కూడ తమనే సంగీత దర్శకుడు.