తమన్ తీసుకున్న డబ్బు కంటే ఎక్కువే చేస్తున్నాడు

SS Thaman doing great promotions for Vakeel Saab

SS Thaman doing great promotions for Vakeel Saab

టాలీవుడ్లో ప్రజెంట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయా అంటే తమన్ అనే అనాలి. మధ్య తరహా హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరి ఛాయిస్ ఇతనే. ప్రస్తుతం ఈయన చేసిన సినిమాల్లో నాలుగైదు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ‘వకీల్ సాబ్’ కూడ ఉంది. తమన్ కు పవన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన్ను పొగుడుతూ ఉంటారు. ఇక సినిమా విషయానికొస్తే తమన్ కంపోజ్ చేసిన ‘మగువ మగువ, సత్యమేవ జయతే, కంటిపాప’ పాటలు బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాయి.

సాధారణంగా సంగీత దర్శకుడు అంటే పాటల వరకే పరిమితం అవుతారు. ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనరు. ఎదో ఒకటి రెండు టీవీ కార్యక్రమాలకు, ఆడియో లాంఛ్ వేడుకలో తప్ప ఎక్కడా కనబడరు. కానీ తమన్ మాత్రం ‘వకీల్ సాబ్’కు అంతకు మించిన ప్రమోషన్లు చేస్తున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. కేవలం పాటల గురించి మాత్రమే కాకుండా సెకండాఫ్లో ట్విస్ట్ అద్దిరిపోతుందని, పాత పవన్ కళ్యాణ్ కనిపిస్తాడని, సినిమా అభిమానులకు ఫీస్ట్ అని హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తమన్ కు సోషల్ మీడియా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన సినిమా గురించి చెప్పే విశేషాలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి.